qwiknews.in | Qwik News Telugu – Breaking News from Andhra Pradesh, Visakhapatnam & Anakapalliఉషోదయ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు › e-Paper Clip qwiknews.in | Qwik News Telugu – Breaking News from Andhra Pradesh, Visakhapatnam & Anakapalli
Share: f 𝕏 in @ 📱 WhatsApp
qwiknews.in 18 Sep 2026, 2:36 pm
Date of Publish : 19 Jun 2026, 5:34 pm  |  Posted by : VARAHALABABU
👁 217 💬 0
Latest News

ఉషోదయ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు

ఉషోదయ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు

మత్తుపదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని ఎక్సైజ్ పోలీస్లు సూచించారు. చోడవరం ఉషోదయ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఆర్థికపరంగా తీవ్ర నష్టాలు కలుగుతాయని వివరించారు. క్షణికానందం కోసం మత్తుపదార్థాల బారిన పడితే జీవిత లక్ష్యాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. స్నేహితుల ఒత్తిడికి లోనుకాకుండా విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.అనంతరం డ్రగ్-ఫ్రీ సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఎన్. నాయుడు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐలు ఎం. శేఖరం, కె. హనుమంతు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.