ఖరీఫ్ సాగుకు రైతులకు తోడ్పాటుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సబ్సిడీ వరి విత్తనాలను గురువారం దేవరాపల్లి మండల కేంద్రంలో పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన అర్హులైన రైతులకు వరి విత్తనాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ, ఉయ్యాలచింతగడ్డ నీటి సంఘం చైర్మన్ గుల్లపల్లి మురళీకృష్ణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అల్లు అబద్ధం, సబ్బవరపు మాలిబాబు పాల్గొని రైతులకు విత్తనాల పంపిణీ చేశారు. రైతులు ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకుని ఖరీఫ్ సాగులో మంచి దిగుబడులు సాధించాలని వారు ఆకాంక్షించారు.