రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన చింతకాయల విజయ్‌ను మాడుగుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా దేవరాపల్లి మండల మాజీ టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుతం రావికమతం పార్టీ పరిశీలకుడిగా ఉన్న చిటిమిరెడ్డి సూర్యనారాయణ, ఎం.అలమండకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పోతల నాయుడు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేసారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనతో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాడుగుల నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా చింతకాయల విజయ్‌కు అభినందనలు తెలియజేశారు.