రాష్ట్ర శాసన సభాపతి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం నర్సీపట్నంలో ఆయన స్వగృహంలో రాష్ట్ర వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయ్యన్న కు శుభకాంక్షలు తెలియచేసిన వారిలో మండలం నుంచి జడ్పీటీసీ మాజీ సభ్యుడు కశిరెడ్డి అప్పలనాయుడు,తెలుగు యువత మాడుగుల నియోజకవర్గం అధ్యక్షులు యడ్ల రమేష్, టీడీపీ యూనిట్ ఇంచార్జి పైల నారాయణ మూర్తి తదితరులు ఉన్నారు.