qwiknews.in | Qwik News Telugu – Breaking News from Andhra Pradesh, Visakhapatnam & Anakapalli › దేవరాపల్లిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు › e-Paper Clip qwiknews.in | Qwik News Telugu – Breaking News from Andhra Pradesh, Visakhapatnam & Anakapalli
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
qwiknews.in 20 Oct 2026, 1:04 am
Date of Publish : 04 Sep 2026, 3:44 pm  |  Posted by : VARAHALABABU
👁 75 💬 0
Latest News

దేవరాపల్లిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

దేవరాపల్లిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

దేవరాపల్లి యాదవ కాలనీలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, టీడీపీ, జనసేన మండల పార్టీ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ, గొర్రెపోటు రామ్మూర్తి నాయుడు, రైవాడ జలాశయ చైర్మన్ పోతల పాత్రునాయుడు, గుమ్మడి శ్రీరామ్, చల్లా తాతయ్యలు, కర్రి దేముళ్లు, కడిమి నాగేశ్వరరావు, పెనగంటి సింహాచలం నాయుడు, గుల్లిపల్లి మురళీకృష్ణ, బంధం అప్పలరాజు, మొల్లి కృష్ణమూర్తి, దివి శంకర్రావు, అల్లు అబద్ధం, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.