పాతవలస జడ్.పి.హెచ్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడి కి సన్మానం

VarahalaBabu
1 Min Read

పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించినందుకు పాతవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేచలపు నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. కశింకోటలోని సెయింట్ జాన్స్ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) విజయభాస్కర్, అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావు నాయుడు, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీరాములు, ఉప విద్యాశాఖాధికారి అప్పారావు కలిసి నాగేశ్వరరావును శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్‌టీఏ అధ్యక్షుడు తుంపాల వెంకటరమణ, ఎన్‌టీఏ రాష్ట్ర కార్యదర్శి పి. కృష్ణంరాజు, కె.కోటపాడు మండల ఎన్‌టీఏ ప్రధాన కార్యదర్శి బి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
34 Comments