చీడికాడ మండలం జైతవరం గ్రామ రైతు సేవా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఉచిత యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ప్రతి ఏడాది జూలై 6న ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ప్రజలు తమ పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. రేబిస్ వ్యాధి నివారణకు టీకాలు కీలకమని తెలిపారు. పశుసంవర్ధక సహాయకుడు మోర్తా శ్రీనివాసరావు 50 కుక్కలకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
