ప్రత్యేక అవసరాల పిల్లలకు తోడుగా సమగ్ర శిక్ష

VarahalaBabu
1 Min Read

దేవరాపల్లి భవిత కేంద్రంలో ఉచిత సహాయక ఉపకరణాల పంపిణీ

దేవరాపల్లి, జూన్ 15(క్విక్ న్యూస్): ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాభివృద్ధి, స్వావలంబనకు చేయూతనిచ్చే దిశగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం దేవరాపల్లి భవిత కేంద్రంలో సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ALIMCO, NIEPID సంస్థల సహకారంతో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎడ్యుకేషనల్ ఇన్‌స్ట్రక్షనల్ మెటీరియల్స్ (ఎంఆర్ కిట్లు), వీల్‌చైర్లు, చేతికర్రలు తదితర ఉపకరణాలను ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ-1 ఈశ్వరరావు మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో ముందంజ వేయాలని సూచించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సహాయక పరికరాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ప్రభుత్వ సహకారంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో MEO-2 ఉషారాణి, ప్రత్యేక ఉపాధ్యాయులు శ్రీరాములు, గాయత్రి, సహిత విద్యా ఉపాధ్యాయులు శ్రీదేవి, అప్పలనాయుడు, సీఆర్‌పీలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
756 Comments