ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి: ఎంపీపీ

VarahalaBabu
0 Min Read
🔄Last Updated: June 19, 2026 5:39 pm

దేవరాపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో ప్రస్తావించిన సమస్యల పరిష్కార పురోగతిని సభ్యులు సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల్లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికలను వివరించారు. మండల ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ కిరణ్ వరప్రసాద్, జడ్పీటీసీ కర్రి సత్యం, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
73 Comments