నాటు సారాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

VarahalaBabu
0 Min Read

కె.కోటపాడు మండలంలోని ఆర్‌.వై.అగ్రహారం గ్రామంలో నాటు సారాయి విక్రయిస్తున్న మహిళను ఎక్సైజ్ పోలీస్లు అరెస్ట్ చేశారు. అనకాపల్లి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వై. రవికుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో జీలం మణి అనే మహిళ వద్ద నుంచి రెండు లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసి చోడవరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం అనకాపల్లి జిల్లా జైలుకు తరలించినట్లు ఎక్సైజ్ ఎస్ఐ శేఖరం తెలిపారు.

📄 Generate e-Paper Clip
Share This Article
29 Comments