ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దేవరాపల్లి నేతలు

VarahalaBabu
1 Min Read
🔄Last Updated: June 19, 2026 5:40 pm

మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి దేవరాపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే 70వ జన్మదిన వేడుకల సందర్భంగా కె.కోటపాడు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పిలుపు మేరకు పుష్పగుచ్ఛాలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను జన్మదిన కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, రైవాడ జలాశయ చైర్మన్ పోతల పాత్రునాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ, చల్లా తాతయ్యలు, బంధం అప్పలరాజు, దివి శంకర్, చామంతుల సన్యాసిరావు (బాలు), చిటిమిరెడ్డి నాయుడు తదితరులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ జన్మదినోత్సవ శుభాభినందనలు తెలిపారు.

📄 Generate e-Paper Clip
Share This Article
5 Comments