ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఒకినావన్ షోరిన్ ర్యు సెబు కాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోటీలు ఆదివారం విశాఖపట్నంలోని ఎల్.ఎన్. గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. డ్రాగన్ ఫోర్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, ఇండియా చీఫ్ వాడోకాయ్ కరాటే అసోసియేషన్ సి.హెచ్. సతీష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఎల్.ఎన్.గార్డెన్స్ గౌరవాధ్యక్షుడు వి. రమేష్ కుమార్, అధ్యక్షుడు యు. నారాయణరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరమని, ఇలాంటి పోటీలు ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో యోగా టీచర్ వి. అనిత, ఎల్‌ఎన్ గార్డెన్స్ కార్యదర్శి ఏ. నీరజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు వై. ఏడుకొండలు, సభ్యుడు ఎం.ఎం. ప్రకాష్, డ్రాగన్ రియాన్ షూటోకాన్ కరాటే డో ఇండియా ప్రతినిధి ఎస్. నూకరాజు, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు కె. శివగణేష్, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఎస్. శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ జె. గౌరీశంకర్, ట్రెజరర్ జి. విగ్నేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ. వాసుదేవరావు, విశాఖపట్నం అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి. నాగరాజు, జనరల్ సెక్రటరీ ఎన్. దేవిప్రియ తదితరులు పాల్గొన్నారు.
