ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న నమ్మకం

VarahalaBabu
0 Min Read

ముషిడిపల్లిలో 15 మంది విద్యార్థుల చేరిక

దేవరాపల్లి, జూన్ 15(క్విక్ న్యూస్): మండలంలోని ముషిడిపల్లిలోని గుల్లేపల్లి సింహాద్రి అప్పడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 15 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. MEO-1 ఈశ్వరరావు పాల్గొని తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. హెచ్‌ఎం వై.వి. రమణ, గ్రామ పెద్దలు సోమిరెడ్డి గోవిందు, బండారు గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
208 Comments