నెట్ జీరో హెల్తీ క్యాంపస్‌లో భాగంగా తెనుగుపూడి, బేతపూడిలో 8,125 మొక్కలు

VarahalaBabu
1 Min Read

ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని బాధ్యతగా సంరక్షించాలని డీడీఓ, మండల ప్రత్యేక అధికారి ఎస్. మంజులవాణి పిలుపునిచ్చారు. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని తెనుగుపూడి, బేతపూడి గ్రామాల్లో నిర్వహించిన విస్తృత స్థాయి మొక్కల నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యాసంస్థలను హరిత ప్రాంగణాలుగా తీర్చిదిద్దడమే నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆమె తెలిపారు. ‘అనంత అరణ్య’ కార్యక్రమంలో భాగంగా తెనుగుపూడిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో 6500 మొక్కలు, బేతపూడిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ప్రాంగణంలో 1625 మొక్కలు నాటినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిరణ్ వరప్రసాద్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీఓ రుక్మిణీదేవి, ఈసీ వెంకటేష్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వై. సంధ్య, గురుకులం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎం. శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్లు సత్యనారాయణ, లక్ష్మారావు, ఎర్రినాయుడు, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఫీల్డ్ అసిస్టెంట్లు,టీడీపీ సీనియర్ నాయకుడు చల్లా నానాజీ, రైవాడ మాజీ సర్పంచ్ చల్లా లక్ష్మీనాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
16 Comments