దేవరాపల్లి, ఆగష్టు 22(క్విక్ న్యూస్): కె .కోటపాడు మండలం ఏ . కోడూరులో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛా ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రావికమతం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు, దేవరాపల్లి పూర్వపు మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ హెలిపాడ్ వద్ద చంద్రబాబుకు ప్రత్యేక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కోసం అహర్నిశను కష్టపడుతున్న సూర్యనారాయణను సీఎం చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి మరింత ఉత్సాహంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
