అయ్యన్నకు ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు

VarahalaBabu
1 Min Read
Oplus_16908288

దేవరాపల్లి, సెప్టెంబర్ 04: రాష్ట్ర శాసనసభా పతి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు జన్మదినం సందర్భంగా శుక్రవారం నర్సీపట్నంలోని ఆయన స్వగృహంలో టీడీపీ నాయకులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావులు అయ్యన్నపాత్రుడిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో దేవరాపల్లి మండలం మాజీ టీడీపీ అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, ఎం.అలమండకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పోతల నాయుడు, మాడుగుల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కర్రి నాయుడు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని వారు ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో ఆయన మరింత క్రియాశీలకంగా సేవలందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శుభాకాంక్షలు తెలిపారు.

📄 Generate e-Paper Clip
Share This Article