Successful financial decision-making depends on research, critical thinking and an awareness of potential risks. The same analytical approach used to evaluate business opportunities can help consumers assess information about iPhone casino apps in the UK, including licensing requirements and the terms attached to promotional offers.

బ్రేకింగ్

యాతపేటలో భారీ అన్న సమారాధన

దేవరాపల్లి మండల కేంద్రంలోని యాతపేటలో ఘడా బాయ్స్, షేక్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం తొమ్మిదో రోజు సందర్భంగా మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, రాజేశ్వరి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు భాస్కరరావు దంపతులను శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధనలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

VarahalaBabu

దీపాల వెలుగుల్లో దేవరాపల్లి శ్రీ లక్ష్మీ గణపతి సన్నిధి

దేవరాపల్లి మండల కేంద్రంలోని కుమ్మరివీధిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం సహస్ర దీపార్చన నిర్వహించారు. మహిళా భక్తులు వివిధ ఆకృతుల్లో ముగ్గులు వేసి దీపాలతో అలంకరించారు. ఎస్‌ఐ వి. సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు కొబ్బరికాయ కొట్టి దీపాలంకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా దీపాలు వెలిగించారు. భక్తులతో కలిసి దీపారాధనలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం దీపకాంతులతో శోభాయమానంగా మారింది.

VarahalaBabu

దేవరాపల్లి రామాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకులు

దేవరాపల్లి రామాలయంలో వినాయక చవితి వేడుకలను సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కిలపర్తి భాస్కరరావు, రాజేశ్వరి దంపతులు వినాయక స్వామివారి ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం వినాయక చవితి వ్రత కథను భక్తులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

VarahalaBabu

పర్యావరణ పరిరక్షణపై తెనుగుపూడి విద్యార్థుల అవగాహన ర్యాలీ

మట్టి వినాయకుడినే పూజిద్దాం అంటూ నినాదాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని విద్యార్థులు అవగాహన కల్పించారు. తెనుగుపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి, వాటిని చేతబట్టి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి గ్రామంలోని వీధుల గుండా ర్యాలీ సాగింది.మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ప్రతిమల వినియోగం వల్ల…

VarahalaBabu

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు పల్లాకు ఆహ్వానం

రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు పల్లాను కలిసిన చల్లా కృష్ణవేణి(నానాజీ) కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను ఆహ్వానించారు. సోమవారం నుంచి 21 రోజులపాటు జరగనున్న ఉత్సవాలకు హాజరు కావాలని కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ చల్లా కృష్ణవేణి, తెదేపా అనకాపల్లి పార్లమెంట్‌ మాజీ ఉపాధ్యక్షుడు చల్లా నానాజీ కోరారు. ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేశారు. ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన పల్లా శ్రీనివాస్‌ తప్పక బ్రహ్మోత్సవాలకు…

VarahalaBabu

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మాజీ డిప్యూటీ సీఎం బూడి పిలుపు స్థానిక సంస్థల ఎన్నికలను సమరంగా భావించి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమష్టిగా పనిచేసి ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పార్టీ సత్తా చాటాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటే స్థానిక ఎన్నికల నుంచే పార్టీ విజయానికి పునాది వేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దేవరాపల్లి మండలం తారువలో గురువారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి…

VarahalaBabu

రైవాడలో చల్లా కృష్ణవేణి(నానాజీ) ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణుల కొవ్వొత్తుల ప్రదర్శన

వైసీపీ పాలనలో 2023 సెప్టెంబరు 9న అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న చంద్రబాబును అక్రమ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ దేవరాపల్లి మండలం రైవాడ గ్రామంలో కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ చల్లా కృష్ణవేణి (నానాజీ) ఆధ్వర్యంలో బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఆ రోజు తమ అధినేత అన్యాయంగా జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టిందని, ఆ నిరంకుశపాలనతో ప్రజలు 2024 జరిగిన ఎన్నికల్లో ప్రజలు చర మగీతం పాడారని…

VarahalaBabu

సేవా కార్యక్రమంతో నాయుడమ్మ జన్మదిన వేడుకలు

పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవడం ద్వారా పలువురికి ఆదర్శంగా నిలిచారు ఎల్.జి.వి.ఎన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ఫౌండర్ అవుగడ్డ సత్యవేణి (నాయుడమ్మ). మంగళవారం లక్ష్మీ గణపతి వెంకట నాయుడు చారిటబుల్‌ ట్రస్టు (ఎల్.జి.వి.ఎన్‌) ఆధ్వర్యంలో దేవరాపల్లి(M) తామరబ్బ పంచాయతీ పరిధిలోని వీరభద్రపేట, బలిపురం గ్రామాల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 50 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పుట్టినరోజు సందర్భంగా సత్యవేణికి మండలంలోని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి భాజపా నాయకులు, పలువురు…

VarahalaBabu

అయ్యన్నకు ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు

దేవరాపల్లి, సెప్టెంబర్ 04: రాష్ట్ర శాసనసభా పతి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు జన్మదినం సందర్భంగా శుక్రవారం నర్సీపట్నంలోని ఆయన స్వగృహంలో టీడీపీ నాయకులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావులు అయ్యన్నపాత్రుడిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో దేవరాపల్లి…

VarahalaBabu

దేవరాపల్లిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

దేవరాపల్లి యాదవ కాలనీలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో…

VarahalaBabu

ఆంధ్రప్రదేశ్

యలమంచిలి

రవికమతం

విశాఖపట్నం

తెలంగాణ

పాలిటిక్స్

క్రైమ్

బిజినెస్

ఎడ్యుకేషన్

జాబ్స్

స్పోర్ట్స్

విశాఖలో ప్రారంభమైన 2వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఒకినావన్ షోరిన్ ర్యు సెబు కాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోటీలు ఆదివారం విశాఖపట్నంలోని ఎల్.ఎన్. గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. డ్రాగన్ ఫోర్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, ఇండియా చీఫ్ వాడోకాయ్ కరాటే…

VarahalaBabu

రాష్ట్రస్థాయి కరాటే పోటీల ట్రోఫీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పంచకర్ల

రాష్ట్రంలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసి, క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. జూలై 12న దువ్వాడలోని అన్నమయ్య ఇండోర్ హాల్‌లో నిర్వహించనున్న 2వ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోటీల ట్రోఫీని మంగళవారం…

VarahalaBabu

కరాటే పోటీల ఇన్విటేషన్ ను ఆవిష్కరించిన ఉషాకిరణ్

విశాఖ వేదికగా ఈనెల 12న జరగనున్న 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్–2026 ఇన్విటేషన్ ను జనసేన పార్టీ విశాఖ నార్త్ ఇన్‌చార్జి పసుపులేటి ఉషాకిరణ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు తప్పనిసరిగా కరాటే నేర్చుకుని ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని…

VarahalaBabu

కరాటే పోటీల పోస్టర్ ను ఆవిష్కరించిన ఓఎస్డీ ప్రభాకర్

కరాటే కేవలం ఆత్మరక్షణ కళ మాత్రమే కాదని, అది క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వానికి ప్రతీక అని విజిలెన్స్ విభాగం ఓఎస్డీ కింజరపు ప్రభాకర్ అన్నారు. బుధవారం ఎంవీపీ కాలనీలో నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా…

VarahalaBabu

హెల్త్

ఎంటర్‌టైన్‌మెంట్